Pregnancy symptoms In telugu-Signs of pregnancy telugu

Telugu ppregnant_storylead_narrowwebregnancy tips-telugu pregnancy guide

చాలా మందిలో గర్భధారణకు మొట్టమొదటి సంకేతం సరయిన సమయంలో రావలసిన ఋతుస్రావం కాకపోవడం. కొందరిలో కడుపులో వికారం, వాంతులు వంటివి అనిపించవచ్చును. దీనిని తేదీ తప్పడం అంటారు. క్రితం ఋతుచక్రంలో చివరి రోజుకు రెండు వారాలు కలుపుకుంటే ఇంచుమించుగా గర్భధారణ సమయం లెక్కించవచ్చును. ఈ తేదీల ఆధారంగానే వైద్య నిపుణులు అంచనా వేసి ఎప్పుడు పురుడు పోసుకునేదీ లెక్కకడతారు. దీనిని నేగలీ సూత్రం (Naegele’s rule) అంటారు. Read More

Telugu Pregnancy tips,telugu pregnancy exercise,telugu pregnancy care

అమ్మనడక..పాపాయికి మేలు Pregnancy during exercise గర్భిణులు వ్యాయామం చేయడం వల్ల తల్లికే కాదు.. బిడ్డకూ ఎంతో మేలు జరుగుతుందని ఓ అధ్యయనం పేర్కొంది. కన్‌సాస్‌ సిటీ యూనివర్శిటీ ఆఫ్‌ మెడిసిన్‌ అండ్‌ బయోసైన్సెస్‌కు చెందిన బృందం నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. గర్భం ధరించినప్పుడు చేసే వ్యాయామం వల్ల గర్భస్థ శిశువు గుండె, నాడీవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటాయట. ఇరవై నుంచి ముప్ఫై అయిదేళ్లలోపు ఉన్న 26 మందిపై ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. గర్భవతులు అదేపనిగా విశ్రాంతి తీసుకోవడం కన్నా రోజూ కాసేపు తప్పనిసరిగా నడవడం మంచిది. తేలికపాటి వ్యాయామాలూచేయవచ్చు. ఇక, జాగింగ్‌ లాంటివి.. అదీ వారానికి మూడుసార్లు చేయడం వల్ల తల్లిబిడ్డలిద్దరిలో చక్కటి మార్పు కనిపిస్తుంది. గర్భస్థ శిశువు శ్వాస ప్రక్రియ.. నాడీవ్యవస్థ పనితీరు క్రమబద్దంగా ఉంటుందంటున్నారు అధ్యయన బృంద సారధి డాక్టర్‌.లిండా మే. అయితే ఒక్కమాట.. ఇవన్నీ చేసేమందు నిపుణుల సలహా తప్పనిసరి. ఆ తర్వాతే వ్యాయామం మొదలుపెట్టాలి. లేదంటే అదనపు సమస్యలు మీదొచ్చిపడతాయి. ఏ మాత్రం అసౌకర్యంగా అనిపించినా వెంటనే వ్యాయామాన్ని ఆపేయడం ఉత్తమం..తల్లీబిడ్డలిద్దరికీ శ్రేయస్కరం అంటున్నారు అధ్యయనం నిర్వహించిన నిపుణులు.Read more